
D News: Sept 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 9,766 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
అడ్మిట్ కార్డులను SBI అధికారిక వెబ్సైట్ sbi.co.inలో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియకు దాదాపు 13.1 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష
SBI క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు మొత్తం 60 నిమిషాల సమయం కేటాయించారు.
అభ్యర్థులు ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాలి
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించి కాల్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే సమయంలో అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, ఫోటోలను తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు.
