Oscars 2027: Two Indian Films in the Race as ‘Gondhal’ and ‘Angh’ Earn Oscar Eligibility

D News: 2027 ఆస్కార్ రేసులో భారత్‌కు చెందిన రెండు సినిమాలు ఒకేసారి నిలిచాయి. మరాఠీ చిత్రం ‘గోంధళ్’ భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక కాగా.. నాగాలాండ్‌కు చెందిన ‘అంగ్’ మాత్రం వేరే మార్గంలో ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 33 సినిమాలను పరిశీలించి, సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధళ్’ను 99వ అకాడమీ అవార్డుల బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర సంప్రదాయ ‘గోంధళ్’ ఆచారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ గుర్తింపులు పొందింది.

మరోవైపు తేజా రియో దర్శకత్వం వహించిన ‘అంగ్’ 2026 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక Platform Prize గెలుచుకుంది. 99వ ఆస్కార్‌కు అకాడమీ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో నిర్దిష్ట అవార్డులు గెలిచిన నాన్-ఇంగ్లిష్ సినిమాలు.. దేశం అధికారికంగా పంపకపోయినా ఆస్కార్ పరిశీలనకు నేరుగా అర్హత సాధించవచ్చు. ఈ జాబితాలో TIFF Platform Award కూడా ఉంది.

అందువల్ల ‘గోంధళ్’ భారత్ అధికారిక ఎంట్రీగా, ‘అంగ్’ TIFF అవార్డు ద్వారా స్వతంత్రంగా అర్హత పొందిన సినిమాగా 2027 ఆస్కార్ రేసులో ఉన్నాయి. అయితే అర్హత సాధించడం నామినేషన్ ఖరారైనట్లు కాదు. తదుపరి అకాడమీ ప్రక్రియలోనే షార్ట్‌లిస్ట్, నామినేషన్ల దశలు ఉంటాయి

By Avinash