Jailer 2: Nelson’s Star-Studded Cast Featuring SJ Suryah and Vidya Balan

D News: సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి భాగాన్ని మించి భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సీక్వెల్‌లో స్టార్ క్యాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

పవర్‌ఫుల్ పాత్రల్లో ముగ్గురు

ఇప్పటికే మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు దిలీప్ పాత్రలో నటిస్తుండగా.. ఎస్.జే.సూర్య బోధి అనే నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా రజనీకాంత్, ఎస్.జే.సూర్య మధ్య వచ్చే సన్నివేశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా విద్యాబాలన్ కూడా ఈ సినిమాలో చేరారు. ఆమె కాంత పాత్రలో కనిపించనుండగా.. మేకర్స్ విడుదల చేసిన లుక్‌లో చీరకట్టులో సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపించారు.

నెల్సన్ ఇంకా ఎవరిని దింపుతాడో?

‘జైలర్’లోనే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ క్యామియోల్లో మెప్పించారు. ఇప్పుడు ‘జైలర్ 2’లో అంతకుమించిన క్యాస్టింగ్‌ను నెల్సన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు “ఇంకెంతమందిని దింపుతావ్ నెల్సన్?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు నెల్సన్ డార్క్ కామెడీ, యాక్షన్‌ను జోడిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

By Avinash