
D News: బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్ పూర్తైంది. ఆదివారం ఎపిసోడ్‌లో సృష్టి, కృష్ణుడు చివరి రౌండ్‌లో ఉండగా.. కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
బయటకు వస్తూ కృష్ణుడు భావోద్వేగానికి లోనయ్యారు. తొలి వారంలో తనతో గొడవపడిన రోహిత్.. కృష్ణుడు వెళ్లిపోతుండగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘మీ కళ్లు మా నాన్నగారి కళ్లలాగే ఉన్నాయి’’ అంటూ రోహిత్ ఎమోషనల్ అయ్యారు. దీనిపై కృష్ణుడు స్పందిస్తూ.. కోపంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని క్షమాపణలు చెప్పారు. త్రిగుణ్ కూడా కృష్ణుడిని పట్టుకుని ఏడ్చారు.
ఎలిమినేషన్‌కు ఆరోగ్య సమస్యలే కారణమా?
స్టేజ్‌పై నాగార్జునతో మాట్లాడిన కృష్ణుడు.. గత ఎనిమిది రోజులుగా స్వీట్లు, షుగర్ పూర్తిగా మానేశానని చెప్పారు. రోజుకు దాదాపు 10 కేజీల స్వీట్లు తినే అలవాటు ఉన్న తనకు ఒక్కసారిగా షుగర్ మానేయడంతో శరీరం నీరసించిందని తెలిపారు. దీని ప్రభావం గేమ్‌పై పడిందని వెల్లడించారు.
బయటకు వెళ్లాక రెండు నెలల్లో క్రమంగా చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని నాగార్జున సూచించారు.
