భారత మహిళల క్రికెట్‌ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో స్మృతి ఈ మైలురాయిని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేసిన ఆమె మొత్తం టీ20 అంతర్జాతీయ పరుగుల సంఖ్యను 4,765కు చేర్చింది.

దీంతో న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ రికార్డును స్మృతి అధిగమించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు 4,758 పరుగులతో బేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా తాజా ఇన్నింగ్స్‌తో స్మృతి ఆమెను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది.

ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4,287 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

By Rajini