
కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయంగా నిమజ్జనం తప్పదని ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్‌లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ తనను వినాయకుడితో పోల్చుకోవడం సరికాదన్నారు. వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయం దానం నాగేందర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. అయితే దానం నాగేందర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు ఫాంహౌస్‌లను సందర్శించడం ఓ జోక్‌లా ఉందని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఫాంహౌస్‌లు ఏమైనా పర్యాటక కేంద్రాలా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
