
D News: హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు మరో మూవీ అందుబాటులోకి వచ్చింది. ‘జబర్దస్త్’తో గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వం వహించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చి సర్ప్రైజ్ చేసింది.
ఒకేసారి రెండు ఓటీటీల్లో..
జులై 31న థియేటర్లలో విడుదలైన ‘కర్మాఖ్య’కు మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను చూడొచ్చు. జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
భారీ తారాగణం
‘కర్మాఖ్య’లో సమైరా, సముద్రఖని, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజ్, గడ్డం నవీన్, వైష్ణవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మై ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి వాణీనాథ్, యశ్వంత్ రాజ్ సంయుక్తంగా నిర్మించారు. అదిరే అభి దర్శకత్వంతో పాటు సినిమాలోని మిస్టరీ, హారర్, థ్రిల్లింగ్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన హారర్, మిస్టరీ థ్రిల్లర్ అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం ఉంది.
