Srikanth Odela Reveals the Real Reason Behind The Paradise Delay

D News: నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల ఆలస్యంపై ఇటీవల పలు రకాల వార్తలు, పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కీలక విషయాలను వెల్లడించారు.

సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం తన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌లో జరిగిన పొరపాట్లేనని ఆయన స్వయంగా అంగీకరించారు. మొదట 165 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. భారీ జన సమూహాలతో కూడిన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా షూటింగ్ 171 రోజులు కొనసాగిందని తెలిపారు.

అయితే సినిమా కోసం ఎలాంటి రీషూట్స్ చేయలేదని శ్రీకాంత్ ఓదెల స్పష్టం చేశారు. మొదటి నుంచే స్క్రిప్ట్ లాక్ అయి ఉందని, రీషూట్స్ కారణంగా షూటింగ్ ఆలస్యం కాలేదని పేర్కొన్నారు.

షాట్ అనుకున్న విధంగా వచ్చే వరకు పదేపదే చిత్రీకరించేవాడినని, ఒక్కోసారి ఒకే షాట్‌ను ఎన్నిసార్లైనా తీసుకున్న సందర్భాలు ఉన్నాయని దర్శకుడు చెప్పారు. ఈ క్రమంలో సెట్‌లోని నటీనటులు, టెక్నీషియన్లను తాను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని సరదాగా వెల్లడించారు.

ఇక నాని డైలాగ్ డెలివరీపై వస్తున్న విమర్శలపైనా శ్రీకాంత్ ఓదెల స్పందించారు. డైలాగ్స్‌లో బేస్ లేదనే విమర్శలను ఆయన అంగీకరించలేదు. పాత్రకు, కథకు సహజత్వమే ముఖ్యమని, అదే ‘ది ప్యారడైజ్’కు బలమని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఆలస్యానికి రీషూట్స్ కారణం కాదని, తన ప్లానింగ్‌లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని దర్శకుడి వ్యాఖ్యలతో స్పష్టత వచ్చింది.

By Avinash