
D News: హీరో సిద్ధార్థ్ మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇటీవల ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’తో నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించిన ఆయన.. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’ (Unaccustomed Earth) అనే ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామాతో రాబోతున్నారు.
ఈ సిరీస్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రిధా పింటో సిద్ధార్థ్‌కు జోడీగా నటిస్తున్నారు. ప్రముఖ రచయిత్రి ఝంపా లాహిరి రాసిన అవార్డు పొందిన నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. మాధురి శేఖర్ షోరన్నర్‌గా, రచయితగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ ఫస్ట్‌లుక్ విజువల్స్‌ను విడుదల చేసింది. కథ విషయానికొస్తే.. క్యాన్సర్‌తో బాధపడుతున్న పార్వతి (ఫ్రిధా పింటో) తన కాలేజీ రోజుల్లో విడిపోయిన తొలి ప్రేమికుడు అమిత్ (సిద్ధార్థ్)ను కలుసుకునేందుకు అమెరికాకు తిరిగి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మళ్లీ చిగురించే ప్రేమ.. వారి కుటుంబాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించనున్నారు.
ఇంద్రనీల్ సేన్‌గుప్తా, పర్వీన్ కౌర్, సరయు బ్లూ, జస్టిన్ బర్తా, ఆది రాయ్, ఐలా సుందర్‌సింగ్ మెక్‌కైగ్, జయంత్ కృపలాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’ డిసెంబర్ 17, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
