Picnic: Premalu Makers Announce a New Family Entertainer.. Releasing for Sankranti 2027!

D News: మంచి కంటెంట్‌తో భాషల హద్దులు దాటిన ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాల తర్వాత భావనా స్టూడియోస్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీకి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ‘పిక్నిక్’ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ సినిమాతో ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి నిర్మిస్తున్నారు. సందీప్ ప్రదీప్ హీరోగా నటిస్తుండగా.. ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్, సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో పచ్చని కొండలు, రంగురంగుల పూల పొలాల మధ్య సినిమాకు సంబంధించిన పాత్రలను చూపించారు. పోస్టర్ చూస్తే ఇది కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాలకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

నాలుగు భాషల్లో ‘పిక్నిక్’

మలయాళంతో పాటు దక్షిణాది మార్కెట్‌పై దృష్టి పెట్టిన మేకర్స్.. ‘పిక్నిక్’ను మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

తెలుగు వెర్షన్‌ను షోయింగ్ బిజినెస్ విడుదల చేయనుంది. గతంలో ‘ప్రేమలు’ను తెలుగు ప్రేక్షకులకు అందించిన నేపథ్యంలో ‘పిక్నిక్’పై కూడా టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana