Jailer 2: First Character Promo Out.. Suraj Venjaramoodu Gets a Powerful Role!

D News: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ తొలి క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేశారు.

35 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడును దిలీప్ పాత్రలో పరిచయం చేశారు. స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రోమోకు మరింత హైప్ తీసుకొచ్చింది.

భారీ తారాగణంతో ‘జైలర్ 2’

2023లో విడుదలైన ‘జైలర్’ విజయానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నా తదితరులు తమ పాత్రలను కొనసాగించనుండగా.. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ముత్తువేల్ పాండియన్ మరోసారి పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నాడనే హింట్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రజనీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్

ఇక రజనీకాంత్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రాన్, యోగిబాబు, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే కమల్ హాసన్‌తో కలిసి KHxRK అనే వర్కింగ్ టైటిల్‌తో మరో ప్రాజెక్ట్‌లో రజనీకాంత్ నటించనున్నట్లు సమాచారం.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana