
D News: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా **‘దాదా’**పై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
బాలయ్యకు గాయం కావడంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరో 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 24న ‘దాదా’ను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం.
థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ‘దాదా’పై బాలయ్య అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
