
D News: తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘జాంబీ రెడ్డి 2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఉపేంద్రను మాస్ లుక్‌లో చూపించడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని మాత్రం చిత్రబృందం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచింది.
ఈసారి కథ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు భిన్నంగా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగనుంది. చార్మినార్ వంటి నగరంలోని ప్రముఖ ప్రాంతాలు కూడా కథలో కనిపించనున్నాయి. బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గౌర హరి సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో 2027లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జ, ఉపేంద్ర పాత్రల పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
