D Educt: Sept 18: JEE Main 2027 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE Main) 2027 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. విద్యార్థుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కూడా JEE Main పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

మొదటి విడత JEE Main పరీక్షలు 2027 జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు NTA వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 2026 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

UGC NET, CUET-PG పరీక్షల తేదీలు కూడా వెల్లడి

JEE Mainతో పాటు మరికొన్ని కీలక జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షల తేదీలను కూడా NTA ప్రకటించింది. UGC NET పరీక్షలను 2026 డిసెంబర్‌ 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

అలాగే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET-PG) 2027 పరీక్షలను మార్చి 1 నుంచి 5, 8, 12 నుంచి 20, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు NTA పేర్కొంది.

పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించడం ద్వారా విద్యార్థులు తమకు సంబంధించిన పరీక్షలకు అనుగుణంగా చదువును ముందస్తుగా ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ సన్నద్ధతను కొనసాగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana