
D News: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనలు కొనసాగుతుండగానే డిజిటల్ రిలీజ్ కూడా కావడం విశేషం.
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమాలో తండ్రి, కూతురు బంధం ప్రధానంగా ఉంటుంది. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక, రమేష్ ఇందిర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘ఇరుముడి’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సినిమాలోని పాటలకు థియేటర్లలో మంచి స్పందన లభించింది.
థియేటర్లలో ఇప్పటికే ప్రేక్షకుల నుంచి స్పందన అందుకున్న ‘ఇరుముడి’కి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
