
D News: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఫుల్‌గా ఉండనుంది. సెప్టెంబర్ 18, శుక్రవారం ఒక్కరోజే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి ఏకంగా 20 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. యాక్షన్, హారర్, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, ఫాంటసీ ఇలా విభిన్న జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరుముడి కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా రిలీజ్లు
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఇరుముడి తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో పాటు లస్ట్ స్టోరీస్ 3 తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఇవే కాకుండా మొదరాత్రి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, సిన్నర్స్, ది క్రౌ క్లబ్, ది స్కాండల్, మాన్స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ వంటి కంటెంట్‌తో పాటు జాకీర్ ఖాన్ స్టాండప్ స్పెషల్ పాపా యార్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లోనూ కొత్త కంటెంట్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ రామ్ అండ్ లీలా, ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా యూ ప్లస్ మీ: ఎగైనెస్ట్ ది వరల్డ్, గర్ల్స్ ఆఫ్ వార్సా డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చాయి.
జియో హాట్‌స్టార్‌లో మలయాళ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ తుడక్కమ్ తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకి వచ్చింది. అలాగే మాబ్ల్యాండ్ సీజన్ 2 కూడా స్ట్రీమింగ్ ప్రారంభించింది.
మిగతా ఓటీటీల్లో..
ETV Winలో తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అందుబాటులోకి వచ్చింది. Aha Tamilలో హారర్ థ్రిల్లర్ ఇరుట్టరై స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక Sun NXTలో తమిళ స్పోర్ట్స్ డ్రామా అంగీకారం, Lionsgate Playలో ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ అపోలో హ్యాస్ ఫాలెన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
మొత్తంగా ఈ వారం ఓటీటీల్లో కంటెంట్‌కు కొదవ లేదు. ముఖ్యంగా ఇరుముడి, లస్ట్ స్టోరీస్ 3, తుడక్కమ్, మాబ్ల్యాండ్ సీజన్ 2 వంటి టైటిల్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
