
D News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా నుంచి తాజాగా విడుదలైన ‘37’ కౌంట్‌డౌన్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘37’ వెనుక అసలు రహస్యం ఏంటి?
మేకర్స్ ఎక్స్ వేదికగా కేవలం ‘37’ అనే నంబర్‌ను షేర్ చేయడంతో #WhatisRaaka37 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ నంబర్‌కు అర్థం ఏమిటనే దానిపై అభిమానులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు కావడంతో.. 3×7=21 అంటూ కొందరు ఫ్యాన్స్ లెక్కలు చెబుతున్నారు.
అదే రోజున ‘రాకా’ నుంచి టీజర్ లేదా కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
భారీ తారాగణంతో ‘రాకా’
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్నట్లు సమాచారం. అలాగే హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెండు భిన్నమైన టైమ్‌లైన్స్‌లో సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కిస్తున్నారని టాక్.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘37’ కౌంట్‌డౌన్ వెనుక ఉన్న అసలు సర్ప్రైజ్ ఏమిటో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
