వెస్టిండీస్‌తో ఈ నెల 27 నుంచి జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ఎంపిక చేసింది. అయితే ఈసారి టీమ్ సెలక్షన్‌లో రిషభ్ పంత్‌కు చోటు దక్కకపోవడం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి వన్డే జట్టులో అవకాశం లభించడం చర్చనీయాంశంగా మారింది.

గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో పంత్ తిరిగి వన్డే జట్టులోకి వస్తాడని అంచనాలు నెలకొన్నాయి. కానీ సెలెక్టర్లు వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. జట్టులో స్థానం దక్కకపోవడంతో పంత్ రాబోయే ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరోవైపు నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్లు కీలక అవకాశం ఇచ్చారు. ఆసియా క్రీడల జట్టు నుంచి అతడిని తప్పించి సీనియర్ వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతోనే నితీష్‌కు వన్డే జట్టులో చోటు కల్పించినట్లు సమాచారం.

వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తదితరులకు జట్టులో చోటు లభించింది.

టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు

టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీతో పాటు వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో ఉన్నారు. శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు టీ20 జట్టులో చోటు సంపాదించారు.

భారత వన్డే జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఔకిబ్ నబీ, యశస్వి జైస్వాల్.

భారత టీ20 జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, సింఘన్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.