Will There Be Clarity on the Chiranjeevi–Srikanth Odela Combo Only After ‘The Paradise’?

D News: మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌ను బట్టి చిరంజీవితో సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది ఆ ప్రచారం సారాంశం.

‘ప్యారడైజ్’పై ఎందుకింత ఫోకస్?

నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే చిరంజీవి–ఓదెల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం ఖాయమవుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోతే ప్రాజెక్ట్ విషయంలో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.

‘కాకా’ తర్వాత ఏ సినిమా?

ప్రస్తుతం చిరంజీవి, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ముందుకు వెళ్తారా, లేక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రకటించిన తన 100వ సినిమాను మొదలు పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే చిరంజీవి–పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల సినిమా విషయంలో వినిపిస్తున్న వార్తలను ఇండస్ట్రీ టాక్‌గానే చూడాలి. ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana