
D News: బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారం అనూహ్య మలుపులతో ముగిసింది. సాధారణ సీజన్లకు భిన్నంగా మొదటి వారంలోనే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో వినాయకచవితి స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హౌస్‌లో రోహిత్, శాలినీ, సృష్టి ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని నాగార్జున ప్రస్తావించారు. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని షోలో తెలుగు మాట్లాడాలని వారికి సూచించారు. అనంతరం ‘హార్ట్‌కు ఎవరు దగ్గర? ఎవరు దూరం?’ గేమ్‌లో కంటెస్టెంట్లు తమకు నచ్చిన, నచ్చని హౌస్మేట్స్ పేర్లను కారణాలతో సహా చెప్పారు. ఈ టాస్క్‌లో దేబ్జానీకి పలువురు దగ్గరగా ఉండగా.. రోహిత్‌ను ఎక్కువ మంది దూరంగా పెట్టడం ఆసక్తికరంగా మారింది. దీంతో రోహిత్ తన ఆటతీరుపై దృష్టి పెట్టాలని నాగార్జున సూచించారు.
ఇక ‘బ్లాక్ కీ’ పవర్ ఎపిసోడ్లో మరో కీలక అంశంగా నిలిచింది. మిగిలిన పవర్స్లో ఒకదాన్ని ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం కంటెస్టెంట్లకే అప్పగించగా.. ఎక్కువ మంది సృష్టి పేరును సూచించారు. దీంతో బ్లాక్ కీ ఆమెకు దక్కింది. అయితే ఆ కీ ద్వారా లభించే అసలు పవర్‌ను తర్వాత వెల్లడిస్తామని నాగార్జున తెలిపారు. మరోవైపు పవర్ బాక్స్ లేని కంటెస్టెంట్లకు నిర్వహించిన పోటీలో సుధీర్ విజయం సాధించడంతో సృష్టి పవర్ బాక్స్ అతడి చేతికి వెళ్లింది.
ఆ తర్వాత సృష్టి, నరేష్‌లను హౌస్‌మేట్స్‌గా ప్రకటించారు. నరేష్‌కు రెండు టీమ్‌లను ఏర్పాటు చేసే బాధ్యత ఇవ్వగా.. సెలబ్రిటీలు, అగ్నిపరీక్ష నుంచి వచ్చినవారు, విభేదాలు ఉన్న కంటెస్టెంట్లు ఒకే టీమ్‌లో ఉండేలా అతడు సమీకరణాలు మార్చాడు. ఎపిసోడ్ చివర్లో వర్షిణి, సుధీర్, కృష్ణుడిని యాక్టివిటీ రూమ్‌కు పిలవడంతో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది. కానీ చివరికి ముగ్గురినీ హౌస్‌మేట్స్‌గా ప్రకటించి బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు.
దీంతో తొలి వారం ముగిసే సమయానికి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లంతా హౌస్‌మేట్స్‌గా మారిపోయారు. దశావతారం కాన్సెప్ట్‌లో భాగంగా మొదటి దశ ‘మహాపరీక్ష’ పూర్తయిందని నాగార్జున ప్రకటించారు. ఇక రెండో వారంలో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కొత్త అవతారం ప్రారంభం కానుంది. ఈ దశలో ప్రేక్షకుల పాత్ర మరింత కీలకంగా ఉండబోతుందని షోలో ప్రకటించడంతో.. బిగ్ బాస్ 10 గేమ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
