
D News: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ రిలీజ్‌పై చాలాకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులతో పాటు ఓటీటీ డీల్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కు ఉన్న ప్రధాన అడ్డంకుల్లో ఒకటి తొలగినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతిపై ‘విశ్వంభర’ టీమ్ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనవరి 13న ఇప్పటికే చిరంజీవి–బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’ విడుదలకు అధికారికంగా ఫిక్స్ అయింది. దీంతో ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు సంక్రాంతి సమయంలో రావడం సాధ్యం కాకపోవడంతో ఏ సినిమా ఆ తేదీని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం మాత్రం ‘విశ్వంభర’ సంక్రాంతికి వస్తుందనే వార్త ఇండస్ట్రీ టాక్కే పరిమితం. అధికారిక రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
