D News: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆయన కొత్త సినిమాకు ‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పోస్టర్‌లో ధృవ్ విక్రమ్ ఇంతకుముందెన్నడూ కనిపించని రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ అరవింద్ కుమార్ తెరకెక్కిస్తుండగా.. మేకర్స్ దీనిని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వికీ సినిమాటోగ్రఫీ, జయసూర్య ఎడిటింగ్, జీఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని విక్రమ్ మోర్ చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ధృవ్ విక్రమ్, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో మరో తమిళ–తెలుగు ద్విభాషా యాక్షన్ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఆ సినిమాను ‘DV4’ వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించారు. దాని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana