New History at the Malayalam Box Office.. Nivin Pauly’s Movie Surpasses ‘Lokah’!

D News: మలయాళ బాక్సాఫీస్‌లో నివిన్ పాలీ నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సంచలనం సృష్టించింది. గిరీష్ ఏ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 24 రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటడమే కాకుండా.. గతంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ‘లోక: చాప్టర్ 1–చంద్ర’ రికార్డును కూడా అధిగమించింది.

తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.305 కోట్ల గ్రాస్ సాధించింది. ‘లోక’ లైఫ్‌టైమ్ కలెక్షన్‌గా నమోదైన రూ.302.65 కోట్లను దాటడంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు.. మలయాళంలో రూ.300 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన రెండో సినిమాగా నిలిచినా, ఈ మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇక కేరళ బాక్సాఫీస్‌లోనూ ఈ సినిమా ఇప్పటికే కొత్త రికార్డు నమోదు చేసింది. మూడో వారం పూర్తయ్యే సమయానికే అక్కడ రూ.130 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు రిపోర్టులు వచ్చాయి. దీంతో ‘వాజ్హా 2’ పేరిట ఉన్న కేరళ రికార్డును కూడా అధిగమించింది.

నివిన్ పాలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ టాక్ బాక్సాఫీస్ రన్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana