
D News: Sept 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 15న ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.
అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పొడిగించిన వయోపరిమితిని పరిగణనలోకి తీసుకుని, 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు ఆధారంగా అర్హతలను నిర్ణయించనున్నారు.
సవరించిన గ్రూప్-1 జాబితా
మరోవైపు గ్రూప్-1 సర్వీసెస్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ పరిపాలనా విభాగం ఖాళీల జాబితాను సవరించింది. ఇందులో నూతన విభాగాలు, పోస్టులను అనుసంధానం చేసినట్లు సమాచారం.
ఈ నెల 15న విడుదల కానున్న షార్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య, ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ తాజా నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేస్తున్నారు.
