
D News: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో నాని ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ 24న రిలీజ్
‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ మారుతుందంటూ వచ్చిన ప్రచారానికి ఇటీవలే మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
అయితే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మాత్రం చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రిలీజ్‌కు వారం రోజుల ముందు ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ట్రైలర్ లేకుండానే సినిమా?
ఇదిలా ఉంటే ‘ది ప్యారడైజ్’ విషయంలో మరో ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథలోని కీలక అంశాలు ముందుగానే బయటకు రాకుండా ఉండేందుకు ట్రైలర్‌ను విడుదల చేయకుండా నేరుగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో హైప్ పెంచుతారా? లేక ఎలాంటి ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారా? అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
