
D News: నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీలో అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రూ.190 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తుండగా.. ఫార్చున్ ఫోర్ సినిమాస్ తెలుగు థియేట్రికల్ రిలీజ్‌ను చేపడుతోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభినవ్ సత్య, విహాన్ శెడ్గే ప్రధాన పాత్రల్లో నటించారు.
నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, భక్తులతో ఉన్న అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. సెప్టెంబర్ 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ గ్రాండ్‌గా విడుదల కానుంది.
