
D Educt: Sept 11: జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు అక్టోబరు 12లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు.
సెప్టెంబరు 11 నుంచి దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత అక్టోబరు 14లోపు సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
