
D Educt: Sept 11: పీజీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 3,144 మంది అభ్యర్థులకు ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్లు లభించాయి. రెండో విడతలో 3,617 సీట్లు అందుబాటులో ఉండగా, 3,144 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.
తొలి విడత కౌన్సెలింగ్‌లో 4,221 మంది సీట్లు పొందగా, వారిలో 2,316 మంది ఆయా కళాశాలల్లో చేరారు. రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 16లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో జాయినింగ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులు సూచించారు.
