
D Educt: Sept 11: జాతీయ పరీక్షల సంస్థ (NTA) సెప్టెంబర్ 8, 10 తేదీల్లో నిర్వహించిన UGC NET రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని సెప్టెంబర్ 10న విడుదల చేసింది. ఆంగ్లం, వాణిజ్యం, సామాజిక శాస్త్రాల పరీక్షలకు సంబంధించిన సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 13లోగా NTA అధికారిక పోర్టల్ ద్వారా తమ అభ్యంతరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా మాత్రమే ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేయాలని NTA స్పష్టం చేసింది.
