
D News: బిగ్‌బాస్ తెలుగు 10 మొదలై వారం కూడా కాకముందే ఊహించని ట్విస్టులు మొదలయ్యాయి. ఇప్పటికే కామనర్ కంటెస్టెంట్ చరణ్ మిడ్వీక్లో ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో సెలబ్రిటీలతో పాటు అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం బ్లూ, రెడ్ టీమ్స్‌గా విభజించి బిగ్‌బాస్ హై రిస్క్ టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం హై రిస్క్ జోన్లో కామనర్స్ నుంచి అమన్, సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చైత్రకు తక్కువ ఓట్లు రావడంతో మిడ్వీక్లో ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇక్కడే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. చరణ్‌తో పాటు చైత్రను కూడా వెంటనే పూర్తిగా బయటకు పంపకుండా మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చి.. వీరిద్దరి మధ్య పోటీ పెట్టనున్నట్లు సమాచారం. ఆ పోటీలో ఓడిన కంటెస్టెంట్‌ను ఈ ఆదివారం నిజమైన ఎలిమినేషన్ ద్వారా ఇంటి నుంచి బయటకు పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ మిడ్‌వీక్ ట్విస్ట్ నిజమేనా? చరణ్, చైత్రలో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతారు? అనేది ఎపిసోడ్‌లోనే తేలనుంది.
