Sanjaytha Menon Joins RAPO-23: Makers Surprise Fans with a Special Announcement

D News: టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఖాతాలో మరో భారీ సినిమా చేరింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘RAPO-23’ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సంయుక్తను ‘RAPO-23’ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ‘స్వయంభు’, ‘స్లమ్ డాగ్’, ‘హైంధవ’, ‘ది బ్లాక్ గోల్డ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామకు ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.

ఇక ‘RAPO-23’ ప్రత్యేకత ఏమిటంటే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. హీరోగా నటిస్తూనే స్వయంగా మెగాఫోన్ పట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ పోతినేని సొంత బ్యానర్ రాపో సినిమాటిక్స్‌పై కృష్ణ పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana