
D News: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న **‘రామాయణ: పార్ట్ 1’**పై గ్లోబల్ స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్‌కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు హాలీవుడ్ స్క్రీన్స్‌పై కూడా ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
స్పైడర్‌మ్యాన్ స్క్రీనింగ్‌లో ట్రైలర్
కెనడాలో ‘Spider-Man: Brand New Day’ స్క్రీనింగ్ సందర్భంగా ‘రామాయణ’కు సంబంధించిన 1 నిమిషం 22 సెకన్ల ఇంగ్లీష్ స్పెషల్ ట్రైలర్‌ను ప్రదర్శించినట్లు సమాచారం. భారీ స్క్రీన్‌పై రణ్‌బీర్, యశ్, సాయి పల్లవి లుక్స్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
50 వేల అంతర్జాతీయ స్క్రీన్స్‌లో రిలీజ్!
‘రామాయణ’ను గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేయడంలో మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా ఈ సినిమాను 50,000కు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. విదేశీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఐ లిప్-సింక్ టెక్నాలజీతో రూపొందించిన ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఈ గ్లోబల్ రిలీజ్‌లో కీలకం కానుంది.
నవంబర్ 6న వరల్డ్‌వైడ్ రిలీజ్
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ ఎపిక్‌లో హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
