Bigg Boss 10: Unexpected Elimination.. Has a Commoner Been Evicted in the First Week?

D News: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి వారమే హౌస్‌మేట్స్ మధ్య వేడి వాతావరణం నెలకొంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. తొలి నామినేషన్ ప్రక్రియతోనే విభేదాలు, గొడవలు మొదలయ్యాయి. దీంతో మొదటి వారం ఎలిమినేషన్‌పై ఆసక్తి పెరిగింది.

ఈ సీజన్‌లో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు ఉన్నారు. దేబ్జానీ మోదక్, త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రామ్ ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, ఆర్జే చరణ్, కృష్ణుడు, వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ హౌస్‌లో ఉన్నారు.

తొలి వారం ఎలిమినేషన్‌లో సెలబ్రిటీ బయటకు వెళ్తాడా? లేక కామనర్‌కు షాక్ తగులుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఓ కంటెస్టెంట్ ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. ఆర్జే చరణ్, ఆటో రామ్ ప్రసాద్ మధ్య ఎలిమినేషన్ కోసం పోటీ జరిగినట్లు తెలుస్తోంది. హౌస్‌మేట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో రామ్ ప్రసాద్‌కు ఎక్కువ మద్దతు లభించడంతో చరణ్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం కాదు. చరణ్ మహాదేవ్ తొలి వారంలోనే మిడ్‌వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లాడనే ప్రచారం మాత్రమే ప్రస్తుతం జరుగుతోంది.

సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై మాట్లాడటంతో పాటు నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తారు. చివర్లో ఎలిమినేషన్‌ను ప్రకటిస్తారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంత అనేది శనివారం లేదా ఆదివారం ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

By Avinash