
D News: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగులు, విద్యార్థులు, యువజన పోరుబాటలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్వీ పోరుబాట
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ప్రదర్శన చేపట్టారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిమాండ్
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మర్రి విమర్శలు
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
హామీల అమలుపై నిలదీత
విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
విద్యానిధి, బీసీ ఫీజులపై ప్రశ్నలు
బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల విద్యానిధి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. బీసీలకు ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
