
D Educt: Sept 9: ఐసెట్ కౌన్సెలింగ్లో నిరాశ.. 17.34 శాతం సీట్లే భర్తీ
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్లో సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కలిపి మొత్తం 46,464 సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 8,059 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో 38,405 సీట్లు మిగిలిపోయాయి.
ఎంబీఏలో మొత్తం 29,762 సీట్లు ఉండగా.. 5,306 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే అందుబాటులో ఉన్న సీట్లలో గణనీయమైన సంఖ్యలో సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి.
ఎంసీఏలో మొత్తం 16,702 సీట్లు అందుబాటులో ఉండగా.. 2,753 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా ఎంబీఏ, ఎంసీఏలో కలిపి 17.34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా.. 82.66 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి.
