Big Box Office Battle This Diwali.. Nayanthara’s Mahashakti to Compete With Ramayana!

D News: ఈసారి దీపావళి పండగ సినీ అభిమానులకు భారీ విందు ఇవ్వబోతోంది. ఒకవైపు రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న భారీ పాన్‌ఇండియా చిత్రం ‘రామాయణ’ నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మరోవైపు నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ కూడా అదే పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.

‘మూకుత్తి అమ్మన్ 2’ను తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదల చేయనున్నారు. నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా కాసాండ్రా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గతంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదలై మంచి ఆదరణ పొందింది. దీంతో సీక్వెల్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.‘మహాశక్తి’ని దీపావళి కానుకగా తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విడుదలకు అనుగుణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన నయనతార ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఒకవేళ ‘రామాయణ’, ‘మహాశక్తి’ ఒకే సమయంలో థియేటర్లలోకి వస్తే.. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana