D News: మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్‌స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆంథనీ, జో రూసో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించారు. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ పేరుతో ప్రత్యేకంగా రీరిలీజ్ చేస్తోంది.

సెప్టెంబర్ 25 నుంచి ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. సాధారణ స్క్రీన్స్‌తో పాటు ఐమాక్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లోనూ ప్రదర్శించనున్నారు.

‘డూమ్స్‌డే’ స్నీక్ పీక్ స్పెషల్

ఈ రీరిలీజ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. డిసెంబర్ 18, 2026న విడుదల కానున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి ప్రత్యేక స్నీక్ పీక్‌ను ‘ఎండ్‌గేమ్: ఎంకోర్’ స్క్రీనింగ్స్‌లో ప్రదర్శించనున్నారు.

దీంతో మార్వెల్ ఫ్యాన్స్‌కు ఒకే థియేటర్ అనుభవంలో ‘ఎండ్‌గేమ్’ రీఎక్స్‌పీరియన్స్‌తో పాటు ‘డూమ్స్‌డే’కు స్పెషల్ గ్లింప్స్ దక్కనున్నాయి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana