
D News: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక మార్పు చేసింది. దశాబ్దాలుగా ఢిల్లీలోనే జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను ఇకపై ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించింది.
‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని మరింత బలపరిచే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్లో జరగనుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతం ఈ వేడుకకు వేదిక కానుంది.
ఇప్పటివరకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డులు అందించే సంప్రదాయం కొనసాగింది. తాజా నిర్ణయంతో ఆ విధానంలో మార్పు చోటుచేసుకుంది. అయితే ఈ ఏడాది వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై విజేతలకు పురస్కారాలను అందించనున్నారు.
జూలైలో ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకోగా.. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నారు.
