
D News: తమిళ హీరో శింబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘అరసన్’**పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. వెట్రిమారన్ కథ, కథనం, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వి. క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు.
ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆండ్రియా, సముద్రఖని, కిశోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఉత్తర చెన్నై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, శింబు విభిన్న గెటప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఓ కార్యక్రమంలో శింబు తొలిసారి ‘అరసన్’ గురించి మాట్లాడారు.
‘అరసన్’ చిన్న సినిమా కాదని చెప్పిన శింబు.. ఇందులో చిన్న వయసు నుంచి పలు వయసుల గెటప్స్‌లో కనిపిస్తానన్నారు. హిందీలో ‘దురంధర్’ ఎంతటి ప్రభావం చూపిందో.. తమిళంలో ‘అరసన్’ కూడా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వెట్రిమారన్ ఎంతో ఫోకస్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారని, వాస్తవికత కోసం పలు రియల్ లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నామని శింబు తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు.అలాగే దీపావళి సందర్భంగా ‘అరసన్’ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని శింబు తెలిపారు. దీంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
