
D Educt: Sept 8: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఇంటర్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల గడువును సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ సెప్టెంబరు 7న ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అయితే సెప్టెంబరు 15 తర్వాత మరోసారి ప్రవేశాల గడువును పొడిగించే అవకాశం ఉండదని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది. కాబట్టి అర్హత ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
