D News: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ బయట జరిగిన పరిణామాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హరీష్ రావు ప్రశ్నలు

సునీతా లక్ష్మారెడ్డి చీర లాగడం, సబితా ఇంద్రారెడ్డి మెడ పట్టుకున్న ఘటనలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

విచారణ తర్వాత చర్యలు: స్పీకర్

మహిళా శాసనసభ్యులపై జరిగిన ఘటనపై విచారణ జరుగుతోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తనపై చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం

తనపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని స్పీకర్ ప్రశ్నించారు. “నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు” అంటూ హరీష్ రావును నిలదీశారు.

సభలో తీవ్ర వాగ్వాదం

సభలో హరీష్ రావు ఎందుకు అంత ఆవేశపడుతున్నారని స్పీకర్ ప్రశ్నించారు. తన తల్లిని దూషించారని, ఆ వ్యాఖ్యలపై తాను సమాధానం కోరుతున్నానని స్పీకర్ పేర్కొన్నారు.

15 నిమిషాలు సభ వాయిదా

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ అసెంబ్లీని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana