స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ శాసనసభ 8వ సెషన్ రెండో సమావేశం తొలిరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. అనంతరం సంతాప తీర్మానాలు, కీలక శాసన పత్రాలు, పరిపాలనా నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్ష నేతలు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది.
సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ సంక్షేమ పథకాల అమలు విద్యా మౌలిక వసతుల అభివృద్ధి రానున్న శాసన తీర్మానాలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆయా అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
