D Educt: Sept 5: UGC-NET రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. సెప్టెంబర్ 9, 10న పరీక్షలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2026 యూజీసీ-నెట్ (UGC-NET) పునఃపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పునఃపరీక్షలు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

ఈ రీ-ఎగ్జామ్‌ను కేవలం ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నట్లు NTA స్పష్టం చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గతంలో నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల అనువాద దోషాలు, టైపోగ్రాఫికల్ తప్పులు, ప్రశ్నలు పునరావృతం కావడం వంటి లోపాలను నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లను రద్దు చేసి, తాజాగా పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక ఈ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అదనపు పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని NTA స్పష్టం చేసింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్షా కేంద్రం, సమయం, ఇతర సూచనలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana