
D Educt: Sept 4: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.
మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 4,519 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య వర్సిటీ తెలిపింది. ఇందులో ప్రత్యేక కేటగిరీకి చెందిన ఎన్‌సీసీ, క్రీడా విభాగాల సీట్లను మినహాయించి.. మిగిలిన 4,322 సీట్లు భర్తీ అయినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ ప్రకటించారు.
