D-News: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు, SEZలో ప్రత్యేక Empty Container Yardను ప్రారంభించనుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ వేర్‌హౌసింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ కొత్త సదుపాయం ద్వారా ఖాళీ కంటైనర్ల నిర్వహణ మరింత సులభం కానుంది. నిల్వ, నిర్వహణ, తనిఖీలు, ఎగుమతిదారులు మరియు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లకు నేరుగా తరలింపు వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

ఏటా 16 లక్షల TEUs ఖాళీ కంటైనర్లు

ముంద్రా పోర్టులో ప్రతి ఏడాది సుమారు 16 లక్షల TEUs ఖాళీ కంటైనర్లు నిర్వహిస్తారు. ఇది దేశ మొత్తం కంటైనర్ వాణిజ్యంలో దాదాపు 35 శాతంగా ఉంది. FY26 నాటికి దేశీయ కంటైనర్ మార్కెట్‌లో APSEZకు 45.5 శాతం వాటా ఉంది. దీంతో దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్‌గా సంస్థ కొనసాగుతోంది.

2031 నాటికి భారీ విస్తరణ

APSEZ తన Ambition 2031 రోడ్‌మ్యాప్‌లో భాగంగా వచ్చే ఐదేళ్లలో తన నెట్‌వర్క్‌లో 60 లక్షలకు పైగా TEUs కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణలో ముంద్రా పోర్టు కీలక కేంద్రంగా నిలవనుంది.

లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం

APSEZ CEO, Whole-time Director అశ్వని గుప్తా మాట్లాడుతూ.. ప్రత్యేక Empty Container Yardతో కంటైనర్ వ్యవస్థలో సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఖాళీ కంటైనర్లను వేగంగా తరలించడం ద్వారా టర్న్‌అరౌండ్ సమయం తగ్గుతుంది. అనవసర కంటైనర్ కదలికలు కూడా తగ్గుతాయి. దీంతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

కస్టమ్స్, షిప్పింగ్ సంస్థలతో సమన్వయం

ముంద్రా పోర్టు SEZలోనే ఖాళీ కంటైనర్ కార్యకలాపాలను నిర్వహించడం వల్ల కస్టమ్స్, షిప్పింగ్ లైన్లు, టెర్మినల్ ఆపరేటర్లు, రవాణా సంస్థల మధ్య సమన్వయం మెరుగుపడనుంది. అలాగే టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థలకు ఈ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుందని APSEZ తెలిపింది.

వికసిత్ భారత్‌కు మద్దతు

దేశ వాణిజ్యానికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని అశ్వని గుప్తా పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి, Viksit Bharat లక్ష్యాలకు మద్దతు ఇచ్చేలా ట్రేడ్-ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana