Dnews 02: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ నేడు. ఆయనకు ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ఈ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’.పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

దేవుడిచ్చిన అన్నయ్య: మంత్రి లోకేశ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana