
D Educt: Sept 2: ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్య కోటా ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగించింది. సెప్టెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విద్యార్థుల వినతుల మేరకు మరో అవకాశం
యాజమాన్య కోటా రిజిస్ట్రేషన్లకు గతంలో ఆగస్టు 20తో గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న వర్సిటీ మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
