
D Educt: Sept 2: ఆరోగ్యశాఖలో 1,931 పోస్టులకు ప్రొవిజినల్ మెరిట్ జాబితా
ఆరోగ్యశాఖలోని 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA-Female) పోస్టులకు ప్రొవిజినల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెప్టెంబరు 1న విడుదల చేసింది. మొత్తం పోస్టులకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది.
సెప్టెంబరు 16 నుంచి ధ్రువపత్రాల వెరిఫికేషన్
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబరు 16 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగళ్‌రావ్‌నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బోర్డు ప్రకటనలో తెలిపింది.
