తెలంగాణ రాజకీయాల్లో కీలక అడుగుగా, నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన ఘనమైన ‘పంచజన్య సంకల్ప సభ’ లో కల్వకుంట్ల కవిత ప్రసంగించారు.
“సామాజిక న్యాయ తెలంగాణ” అనే ప్రధాన నినాదంతో సాగిన ఈ సభ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలతో మరింత విస్తృతంగా మమేకమయ్యేందుకు రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమానికి దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలిచింది. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల సాధికారత, ప్రజల భాగస్వామ్యంతో బలమైన తెలంగాణ నిర్మాణమే ఈ సంకల్ప సభ లక్ష్యం.


