D Educt: Aug 24: విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష క్విజ్‌లో కోదాడ విద్యార్థి ప్రతిభ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సంయుక్తంగా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ఈ నెల 17న ఆన్‌లైన్‌లో ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష క్విజ్’ పోటీలను నిర్వహించాయి.

ఈ పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి కత్తి అక్షయ్‌రెడ్డి ప్రతిభ కనబరిచి అంతరిక్ష సదస్సుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, డైరెక్టర్ సోమిరెడ్డి శనివారం వెల్లడించారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన 30 మంది విద్యార్థులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరిని జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో నిర్వహించే అంతరిక్ష సదస్సుకు ఆహ్వానించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

కోదాడకు చెందిన అక్షయ్‌రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana